బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామానికి చెందిన తిర్రి రాజన్న(65) అనే రైతు బుధవారం నారుకు నీరు పెట్టడానికి పొలానికి వెళ్ళాడు. మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడ్డాడు. రాజన్న ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలంలోని బావిలో మృతి చెంది కనిపించాడు. రాజన్న భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్సై తెలిపారు.