సేవే లక్ష్యం! ప్రేమే మార్గం!! అభాగ్యులకు అండ మీ అడ్లూరి సేవలు అనే నినాదంతో ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అమరగొండ సత్యనారాయణ గౌడ్ సారధ్యంలో పురుడు పోసుకున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభిమానుల సంఘం తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. తాజాగా ఎండపల్లి మండలం చర్లపల్లి లో శనివారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అభాగ్యులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవల కొరకు ఎందరో అభాగ్యులు ఎదురుచూస్తున్నారు.