జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన నక్క లక్ష్మణ్ అనే వ్యక్తి పదవీ విరమణ పొందగా పింఛను 20 వేలు వచ్చేది. నెల నెలా బ్యాంకుకు వెళ్లి తెచ్చుకునేవాడు. పక్క ఇంటిలో ఉంటున్న దీకొండ తిరుపతి అనే యువకుడు బ్యాంకులో తన సెల్ నంబరు మార్చుకుని అతనికి వచ్చే 46 వేల పింఛను నుంచి ప్రతి నెల 26 వేలు కాజేస్తున్నట్లు ఈ మధ్యనే గుర్తించారు. ఈ మేరకు బాధితుడు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.