జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ కు చెందిన మారంపల్లి హర్షిత కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ ఉండగా స్థానిక నాయకులు సమస్యను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 2 లక్షల 50 వేల రూపాయలు విలువగల ఎల్ఓసి నీ జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కుటుంబ సభ్యులకు సోమవారం అందజేశారు. వారి వెంట నాయకులు దుమాల రాజకుమార్, పేట భాస్కర్, దూడ వెంకటేశ్ ఉన్నారు.