వనపర్తి జిల్లా పెబ్బేరు శివారులోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆగి ఉన్న వెహికిల్ పై దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేసి 14 తులాల బంగారం చోరీ చేసి దారి దోపిడీకి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కూజన్ కొత్తూరుకు చెందిన 3 కుటుంబాలు తీర్ధయాత్రలకు వెళ్లి తిరిగివస్తున్నారు. నిద్రపోదామని పెబ్బేరు శివారులో భారీ వాహనాలు నిలిపే స్థలంలో కారుని ఆపారు. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు కత్తులు, రాళ్లతో దాడి చేసి వెహికిల్లో ఉన్న 8 మంది వద్ద బంగారం చోరీ చేశారు.