పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

65చూసినవారు
పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
జగిత్యాల జిల్లా పెగడపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట మల్యాల సీఐ రవి ఎస్ఐ రవికిరణ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్