జగిత్యాల జిల్లా మల్యాల పోలీసులు ఇద్దరు దొంగలను ఆదివారం అరెస్ట్ చేశారు. మల్యాల పోలీస్ స్టేషన్ లో జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ మాట్లాడుతూ ఈ నెల 9న కొండగట్టు సమీపంలో దోపిడికి పాల్పడిన వారని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో గుర్రం వెంకటేశ్, విష్ణు వర్ధన్ ఉండగా వారి నుంచి బంగారం, వెండి, ఐ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.