కలెక్టరేట్ కార్యాలయం సోమవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలందరిని భాగస్వాములను చేయాలని అన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, కిశోర బాలికలు, చిన్నారులు తీసుకోవలసిన పోషకాహారం గురించి వివరించే ప్రదర్శనలు, సమావేశాలు, ర్యాలీలు, మేళా వంటివి ఏర్పాటు చేయాలన్నారు.