జగిత్యాల జిల్లా కోరుట్లలో అప్పుల బాధ తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. మెట్ పల్లికి చెందిన కంభంపాటి వినయ్ (35) కొంతకాలంగా ప్రైవేట్ ఉద్యోగం చేయగా చాలీచాలని జీతంతో అప్పులు చేసి జీవనం కొనసాగించేవాడు. ఇప్పుడు ఉద్యోగం పోవడంతో అప్పు ఇచ్చినవారు ఒత్తిడి చేయడం వల్ల శనివారం మనస్తాపంతో కోరుట్లలోని ఓ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.