మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

26764చూసినవారు
మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య
మెట్‌పల్లి మండలం వెల్లుల గ్రామానికి చెందిన నేరెళ్ల హరీశ్‌ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హరీశ్‌ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.. ఆమెకి ఇటీవల మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. ప్రేమించిన యువతిని విడిచి ఉండలేక మనస్తాపానికి గురై, మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్