మానకొండూర్ మండల కేంద్రంలో బుధవారం అయ్యప్ప మాలదారులు అయ్యప్ప స్వామి సంకీర్తన శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం డిజె సాంగ్స్ తో, అయ్యప్ప స్వామి భక్తి పాటలతో, అయ్యప్ప నామస్మరణలతో ప్రాంతమంతా మారుమోగించారు. భక్తులు మంగళహారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.