కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రూ. 6000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నాలా కన్వర్షన్ కోసం మండలంలోని ఓ వ్యక్తి అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.