ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో బుధవారం మండల స్థాయిలో జరుగుతున్న సీఎం కప్ ఆటల పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దుస్తులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకొని రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా పాల్గొనాలని కోరారు.