2024లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ 2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ సినిమాల జాబితాని బుధవారం విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. స్త్రీ2, మహరాజ్, షైతాన్, ఫైటర్, మంజుమ్మల్ బాయ్స్, భూల్ భూలయ్య 3, కిల్, సింగమ్ అగైన్, లాపతా లేడీస్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.