కరీంనగర్: గుండెపోటుతో మార్కెటింగ్ ఏజెంట్ మృతి

56చూసినవారు
కరీంనగర్: గుండెపోటుతో మార్కెటింగ్ ఏజెంట్ మృతి
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన విషాదకరమైన ఘటన తిమ్మాపూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని బాలయ్య పల్లిలో శనివారం రైతులకు జాన్డీర్ ట్రాక్టర్ గురించి అవగాహన కల్పిస్తూ కుప్పకూలి గుండెపోటుతో తుర్కల కొత్తపల్లికి చెందిన అలువాల మల్లేశం(30) మృతి చెందాడు. మృతుడు ఓ ట్రాక్టర్ షో రూంలో మార్కెటింగ్ ఎజెంట్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్