మంథని పట్టణంలో ఉన్న మార్కెట్ యార్డ్ తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో మంథని మున్సిపాలిటీపై అధికారులతో కలెక్టర్ శ్రీహర్ష అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలసి సమీక్ష నిర్వహించారు. మార్కెట్ యార్డు ఉన్న చోట సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని, తాత్కాలికంగా తరలించేందుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని సూచించారు.