కాంగ్రెస్ తోనే ఎస్సీల అభివృధ్ధి: ఎమ్మెల్యేలు

79చూసినవారు
కాంగ్రెస్ తోనే ఎస్సీల అభివృధ్ధి: ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ తోనే ఎస్సీల అభివృద్ది, సంక్షేమం సాధ్యమని పెద్దపల్లి, చెన్నూర్ ఎమ్మెల్యేలు విజయరమణారావు, వివేక్ వెంకటస్వామి అన్నారు. పెద్దపల్లిలో ఆదివారం రాత్రి ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతు ప్రకటించారు. ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారన్నారు.

సంబంధిత పోస్ట్