సామాన్య ప్రజలు తమ సొంత అవసరాలకు జిల్లాలోని 6 రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకొని వెళ్లొచ్చని గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటనలో తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్ పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో జిల్లాస్థాయి సాండ్ కమిటి సమావేశం నిర్వహించి నూతన ఇసుక పాలసీ ఆమోదించిన విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి జిల్లాలో సామాన్య ప్రజలు సొంత అవసరాలకు జిల్లాలోని 6 రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక తీసుకోవచ్చన్నారు.