
విమాన ప్రమాదం.. 202 మృతదేహాల గుర్తింపు
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాద ఘటనలో మరణించిన 202 మంది మృతదేహాలను అధికారులు గుర్తించడం జరిగింది. వీటిలో 157 మంది మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అప్పగించారు. ఈ విమాన ప్రమాద ఘటనలో 279 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.