నిరంతరం వెలుగుతున్న వీధి దీపాలు
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లి గ్రామంలోని వీధి దీపాలు గత నెల రోజులుగా నిరంతరం 24గంటలు వెలుగుతూనే ఉన్నాయి. నిరంతరం వెలగడం వల్ల కరెంటు వృథాతో పాటు లైట్లు కూడా చెడిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్ కాబట్టి ఇప్పటికైనా గ్రామ ప్రత్యేక పాలనాదికారి స్పందించి వీధి దీపాలు నిరంతరం వెలగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.