పుట్నూరు సబ్ స్టేషన్ లో కోతుల హంగామా
పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామ సబ్ స్టేషన్ లో ఆదివారం తెల్లవారుఝామున అకస్మాత్తుగా ఒక కోతుల గుంపు చొరబడి నానా హంగామా సృష్టించాయి. అక్కడే విధినిర్వహణలో ఉన్న ఆపరేటర్ కోతులను నివారించే ప్రయత్నం చేయగా అవి ఒక్కసారిగా ఆపరేటర్ పైకి దాడికి ప్రయత్నించగా అతను వెంటనే కంట్రోల్ రూంలోకి పరుగెత్తాడు. కాగా పైకి ఎక్కిన కోతులకు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. కొన్నింటికి తీవ్ర గాయాలయ్యాయి.