పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లిలో బీసీ బాలుర కళాశాల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న వసతులు, భోజనం నాణ్యత వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ అందుబాటులో ఉంటున్నారా, ఆరోగ్య సమస్యలున్నాయా, పారిశుధ్యం బాగుందా అని కలెక్టర్ ఆరా తీశారు.