వేసవిలో పెరుగు అన్నదానం

69చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్ హనుమాన్ నగర్ లో గల శ్రీ రామ భక్త అభయాంజనేయ స్వామి దేవాలయంలో వేసవి కాలం దృష్ట్యా పెరుగు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ కొంతం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం మొదలైన పెరుగు అన్నదాన కార్యక్రమం నెల రోజులపాటు కొనసాగుతుందని, ఇందుకు సహకరించిన కరీంనగర్ శివకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్