పెద్దపల్లి మండల స్థానిక భవిత కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ జాతీయ మేధో దివ్యాంగ వ్యక్తుల సాధికారిత సంస్థ (ఎన్. ఐ. ఈపి. ఐ. డి), సికింద్రాబాద్ ఆధ్యర్యంలో వివిధ పాఠశాలల్లో చదువుతున్న మేధో దివ్యాంగ విద్యార్ధుల బాల బాలికలకు మొత్తం 15 మందికి టీచింగ్ లెర్నింగ్ మెటిరియల్ కిట్లు జిల్లా విద్యాధికారి డి. మాధవి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్. ఐ. ఈపి. ఐడి సంస్థ కోర్డినేటర్ ఎస్. లకన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.