రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. సోమవారం సాయంత్రం ఓదెల మండలం గుండ్లపల్లి, పిట్టల ఎల్లయ్యపల్లి, కనగర్తి, మడక, జీలకుంట, శానగొండ, భీమరపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.