పెద్దపల్లి మండలం హనుమంతునిపేట గ్రామానికి పూదరి ఐలయ్య (58) అనే గీత కార్మికుడికి ప్రమాదవశాత్తు తాటి చెట్టుపై నుండి పడి తీవ్ర గాయాలయ్యాయి. బాధితున్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఐలయ్య చెట్టుపై నుండి పడడంతో కాలు, చెయ్యి విరిగి గాయాలు కావడంతో ఉపాధి కోల్పోతున్నాడని, నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిరావు, గ్రామస్థులు కోరారు.