పోలింగ్ నిబంధనలపై సంపూర్ణ అవగాహన ఉండాలి

571చూసినవారు
పోలింగ్ నిబంధనలపై సంపూర్ణ అవగాహన ఉండాలి
పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పెద్దపల్లి శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజ్ కుమార్, పాఠశాల అకాడమిక్ అధికారి పిఎం షేక్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్