పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంతనగర్లోనే విమానాశ్రయం ఏర్పాటు చేయాలని గురువారం ఈశాల తక్కల్లపల్లి గ్రామస్తులు పాలకుర్తి మండలం తహసీల్దార్ జ్యోతికి వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాన్ని విస్తరించాలని గతంలోనే ఇక్కడ అధికారులు భూసేకరణ చేసి నివేదికలు పంపించారని, శాంపిల్స్ కూడా తీసుకున్నారని, కేవలం విద్యుత్ హై టెన్షన్ తీగలు అడ్డుగా ఉన్నాయనే సాకుతో విమానాశ్రయాన్ని తరలించడం సరైనది కాదన్నారు.