ముస్తాబాద్ ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రెస్ ధరించాలని, వాహన కండిషన్ రోజు పరిశీలించాలని, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లకూడదని సూచించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనాలు నడపరాదని, లేకుంటే చట్టపరంగా జరిమానా విధిస్తామని పేర్కొన్నారు.