కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 'ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని కేసులు పెట్టినా భయపడొద్దు. మళ్లీ మన టైం వస్తది. అన్నీ రాసుకుంటున్నా. గ్రామాల్లో కార్యకర్తలను వేధిస్తున్న వాళ్ల పేర్లు రాసుకోండి. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం' అని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.