కొత్త ఏడాదిలో ఒక్కొక్క నెల ఒక కార్యక్రమం చేద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం సిరిసిల్ల పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడారు. 'ముసలి వాళ్లకు నాలుగు వేల పెన్షన్, ఆడబిడ్డకు నెలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటర్లు, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎప్పుడు ఇస్తావు అంటూ ప్రతి నెల ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టి వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చేద్దాం' అని అన్నారు.