రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.