గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. గల్ఫ్ కార్మిక సంఘం నాయకులు మంగళవారం వేములవాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే ప్రజలకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.