రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్ధి పోచమ్మ ఆలయానికి మంగళవారం నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ భక్తజనం వేడుకున్నారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం బద్ది పోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది.