ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగులు మంగళవారం సిరిసిల్ల-కరీంనగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ముందుగా డిమాండ్లు పరిష్కరించాలంటూ చేపట్టిన దీక్ష 22వ రోజు మంగళవారం దీక్ష శిబిరం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాస్కులు ధరించి హామీలను అమలు చేయాలని వారు నినాదాలు చేశారు.