ఆది శ్రీనివాస్ కు ఫొటోలు దిగడంలో వున్న శ్రద్ధ ఆలయ అభివృద్ధిపై లేదని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహరావు విమర్శించారు. సోమవారం వేములవాడ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే మాటిమాటికీ ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. కోడెల పోషణను విస్మరించి రైతులకు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. 1734 కోడెలపై ఆది శ్రీనివాస్ స్పందించాలని డిమాండ్ చేశారు.