వేములవాడ రాజన్న సన్నిధానం మంగళవారం భక్తులు లేక దర్శనమిస్తుంది. ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం అనునిత్యం భక్తులతో రద్దీగా దర్శనమిచ్చేది. మంగళవారం నేపథ్యంలో ఆలయానికి అనుబంధ దేవాలయమైన బద్దిపోచం ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. కానీ రాజన్న ఆలయానికి సోమవారమే అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.