‘కార్తీకదీపం’ సీరియల్ నేడు(ఫిబ్రవరి 3)న 1267 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఈ ఎపిసోడ్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
కార్తీక్, దీపలతో ఆ అంజలి, ధనుంజయ్‌లు ‘మీ పాపకి ఇప్పుడు కూడా డాక్టర్ కార్తీక్ గారే ఈ ఆపరేషన్ చెయ్యగలరు’ అని అంటారు. దీప.. ‘నేను అతడ్ని రప్పించుకుంటాను. మీరు ఏర్పాట్లు చెయ్యండి.. ఆయన కాళ్లు పట్టుకుని అయినా నేనువేడుకుంటాను. మీరు ఏర్పాట్లు చెయ్యండి’ అంటుంది. ‘దీపా’ అని కార్తీక్ వారించే ప్రయత్నం చేసినా దీప వినదు. ‘ఏం మాట్లాడుతున్నావ్ దీపా.. నేను సౌర్యకి ఆపరేషన్ చెయ్యడం ఏంటీ?’ అంటే.. దీప ఏడుస్తూ.. ‘వాళ్లే చెబుతున్నారు కదా డాక్టర్ బాబు.. మీరే చెయ్యగలరని.. కళ్లుముందు బిడ్డ ప్రాణాలు పోగొట్టుకుంటామా.. చెప్పండి’ అంటూ కాళ్ల మీద పడిపోతుంది.
సీన్ కట్ చేస్తే.. మోనిత తన ఇంట్లో కూర్చుని ఆదిత్య వాళ్లతో చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తుంది. ఈ ఛాలెంజ్ లో నువ్వు గెలవాలి గెలిచి చూపించాలి అని తనలో తానే అనుకుంటుంది. ఇంతలో భారతి వస్తుంది.. ‘10 రోజుల్లో కార్తీక్‌ని బాబుని తీసుకొచ్చి ఆ ఇంట్లో కాలు పెడతాను అని ఆదిత్య వాళ్లతో ఛాలెంజ్ చేశాను భారతి’ అని మోనిత అంటుంది. ‘నువ్వు అన్నీ ఆవేశంలోనే చేస్తావ్ మోనితా.. అలా ఎలా సాధ్యం మోనితా’ అంటుంది భారతి.
నేను ఊరు వెళ్తున్నాను.. నువ్వు వస్తావా మోనితా? అని భారతి అడుగుతుంది. తన ఫ్రెండ్ డాక్టర్ అంజలి(కార్తీక్, దీప, సౌర్య ఆపరేషన్ ఆమె ఆసుపత్రిలోనే చేయిస్తున్నారు) వాళ్ల పాప బర్త్ డే పార్టీకి వెళ్తున్నానని చెబుతుంది. నేను రాను భారతి.. నేను కార్తీక్‌ని బాబుని వెతుక్కోవాలి..’ అంటుంది మోనిత. వెంటనే.. ‘ఆ ఊరు ఎక్కడన్నావ్’ అంటుంది భారతిని మోనిత. ‘చాలా దూరం మోనితా.. 300 కిలో మీటర్లు పైనే ఉంటుంది’ అంటుంది భారతి. ‘ఒకవేళ అక్కడే నా కార్తీక్ ఉన్నాడేమో.. దేవుడు ఇలా భారతి ద్వారా అవకాశం ఇస్తున్నాడేమో’ అని మనసులో అనుకుంటూ.. ‘నేను వస్తాను భారతి..’ అంటుంది.
ఇక రుద్రాణి అయితే తన మనుషులతో దీప, కార్తీక్‌లు ఏ ఆసుపత్రిలో ఉన్నారో వెతికిస్తూ ఉంటుంది. కార్తీక్ ఓ రూమ్‌లోకి వెళ్లి.. డాక్టర్స్ ఆపరేషన్ థియేటర్‌కి వెళ్లే ముందు వేసుకునే డ్రెస్ మొత్తం వేసుకుంటూ ఉంటాడు. కార్తీక్ ఆపరేషన్ థియేటర్‌కి వెళ్తాడు. ‘ఐయామ్ డాక్టర్ కార్తీక్’ అంటాడు. ‘డాక్టర్ అంజలీని పిలవండి’ అంటాడు. నర్స్ వెళ్లి అంజలీని పిలుచుకుని వస్తుంది. మొత్తానికీ ఆపరేషన్ మొదలైంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.