TG: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై వేమువాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించకుండా అధికారంలోకి వస్తామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, సింగిల్‌గా కాదు.. బీజేపీతో కలిసి వచ్చినా అది మీతో సాధ్యం కాదంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చాడని, కాంగ్రెస్ హయాంలో గ్యారంటీల అమలు జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు.