బైక్‌పై వస్తుంటే గాలిదుమారానికి విరిగిపడ్డ చెట్టు

62చూసినవారు
బైక్‌పై వస్తుంటే గాలిదుమారానికి విరిగిపడ్డ చెట్టు
కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణ సమీపంలో గాలి దుమారానికి చెట్టు విరిగిపడి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. న్యాల్‌కల్ మండలం శంషోలాపూర్ గ్రామానికి చెందిన అశ్వంత్, లోకేష్ ఇద్దరు కలిసి బైక్‌పై బీదర్‌కు కిరాణా సామాను తీసుకునేందుకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో షాపూర్ గ్రామ సమీపంలోని రైల్వే గేటు వద్ద ఉన్న చెట్టు గాలి దుమారానికి విరిగి బైక్‌పై పడిపోయింది. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్