ఐపీఎల్ 2025 భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో కేకేఆర్ మూడు వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ సునీల్ నరైన్(44), అజింక్య రహానే (56), వెంకటేష్ అయ్యర్ (6) ఒకరి తరువాత ఒకరు ఔటయ్యారు. కృనాల్ బౌలింగ్‌లో రహానే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా, వెంకటేష్ బౌల్డ్ అయ్యారు. దీంతో 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్ 141/4గా ఉంది.. ప్రస్తుతం క్రీజులో రఘువంశీ, రింకూ సింగ్ ఉన్నారు.