వరంగల్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ సమావేశం

56చూసినవారు
వరంగల్‌ జిల్లా నేతలతో కేసీఆర్‌ సమావేశం
వరంగల్‌ లోక్‌సభ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్‌ కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ జిల్లా నేతలతో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో గులాబీ బాస్ సమావేశమయ్యారు. ఈ మీటింగ్ లో ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ పిలుపుతో ఫామ్ హౌస్ కి చేరుకున్న రాజయ్య సమావేశానికి హాజరయ్యారు. కాగా, అసెంబ్లీ ఫలితాల తర్వాత BRSకు రాజయ్య రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్