కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్

63చూసినవారు
కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 'తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ గురించి కేసీఆర్ కు మాట్లాడే అర్హత లేదు. కమీషన్ల కక్కుర్తితో డిజైన్లు మార్చి ప్రాజెక్టులు కట్టారు. కరెంట్ పోయిందని తప్పుడు మాటలు చెబుతున్నారు. మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. రైతులనుంచి ప్రతి గింజ కొంటాం. కేసీఆర్ కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్