ఫ్లైఓవర్ పైనుంచి కిందపడ్డ కిరోసిన్‌ ట్రక్కు (VIDEO)

84చూసినవారు
మహారాష్ట్రలోని ముంబై-అహ్మదాబాద్ హైవేపై ఘోర ప్రమాదం తప్పింది. పాల్ఘర్ వద్ద ఫ్లైఓవర్ పై నుంచి కిరోసిన్‌తో వెళ్తున్న ట్రక్కు కింద పడింది. దీంతో ట్రక్కులో మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు దూరంగా పరిగెత్తారు. అదృష్టవశాత్తు ట్రక్కు కిందపడ్డ సమయంలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్