మయన్మార్‌లో శుక్రవారం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు, చిలీలో వచ్చిన భూకంపంలో (1960) కనీసం 1,655 మంది, గుజరాత్‌లోని కచ్‌లో (2001) దాదాపు 20,000 మంది మరణించారు. భూకంపాల తర్వాత వచ్చిన సునామీల వల్ల అలాస్కాలో (1964) 139 మంది, సుమత్రాలో (2004) 2.30 లక్షలకుపైగా మంది, జపాన్‌లో (2011) 18 వేలకు పైగా మంది, రష్యాలో (1952) 10,000-15,000 మంది మరణించారు.