బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం కేసులో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో శనివారం పట్టుబడిన అనుమానితుడిని రిలీజ్ చేస్తున్నట్లు ముంబై సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ ఫండే తెలిపారు. అతడిని అనుమానంతో అదుపులోకి తీసుకున్నామని, విచారణలో అతడికి ఈ ఘటనతో ఏ సంబంధం లేదని తేలిందన్నారు. దీంతో ఆ వ్యక్తిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.