పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇస్లామిక్ జిహాద్ టాప్ కమాండర్ మహమ్మద్ అబ్దుల్లా హతమయ్యారు. హమాస్‌కు అనుబంధ సంస్థగా ఇస్లామిక్ జిహాద్ కొనసాగుతుంది. శరణార్థుల శిబిరంపై తాము చేసిన దాడిలో అబ్దుల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. ఇజ్రాయెల్‌పై జరిగిన పలు దాడుల్లో అబ్దుల్లా నిందితుడని ఇజ్రాయెల్ మిలటరీ అధికారులు పేర్కొన్నారు.