ములకలపల్లి: ధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగాలి
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా సాగాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ అధికారులను ఆదేశించారు. శనివారం ములకలపల్లి మార్కెటింగ్ యార్డు వద్ద పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు.