భద్రాచలం పట్టణంలోని ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ధనలక్ష్మి తన ఇంట్లో గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే భద్రాచలంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా విద్యార్థి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.