ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ పై కేసు

1536చూసినవారు
ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ పై కేసు
ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్ పై కేసు నమోదు చేసినట్లు గురువారం ఖమ్మం వన్ టౌన్ సీఐ ఉదయ్ కుమార్ తెలిపారు. సుగ్గులవారితోటకు చెందిన సాయిసందీప్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. ఖమ్మంకు చెందిన ముగ్గురు ఈఎంఐ కట్టకపోవడంతో వారి నుంచి వాహనాలు రికవరీ చేసిన వాహనాలను కంపెనీకి అప్పజెప్పకుండా అమ్మేసుకున్నాడు. కంపెనీకి మాత్రం వాహనదారుల ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నాడు.

సంబంధిత పోస్ట్